రామన్నపేట లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన శ్రీమతి గుండు సుధారాణి
మాహాత్మ గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం రోజున 29వ డివిజన్ రామన్నపేటలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బొమ్మ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కాకతీయ పట్టనాభివృద్ధి సంస్థ (KUDA) చైర్ పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, జి.డబ్ల్యూ.ఎం.సీ. మాజీ మేయర్ *"శ్రీమతి గుండు సుధారాణి"* గారు ముఖ్య అతిథిగా, ప్రత్యేక అతిథిగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్చార్జి, మాజీ డిప్యూటీ మేయర్ తక్కల్లపల్లి అశోక్ రావు గార్లు విచ్చేసి *మహాత్మా గాంధీ విగ్రహానికి* పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా *గుండు సుధారాణి* మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక భూమిక పోషించాడని కొనియాడారు. గాంధీజీ ఆశయాలను...