వరంగల్ జిల్లాలో బార్ బంద్కు మద్దతు..
ప్రివిలేజ్ ఫీజు పెంపుపై వ్యతిరేకత వరంగల్, అక్టోబర్ 4: తెలంగాణ ప్రభుత్వం బార్లపై ప్రివిలేజ్ ఫీజును 10 శాతం నుంచి 16 శాతం వరకు పెంచే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన బంద్ పిలుపుకు వరంగల్ జిల్లా బార్ ఓనర్స్ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం వరంగల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, బార్ యజమానులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రివిలేజ్ ఫీజు పెంపు వల్ల ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న బార్లపై మరింత ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైన్ షాపుల్లో...