PRGTA నల్లగొండ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు

*గురుకుల ఉపాధ్యాయుల పని ఒత్తిడి తగ్గించి, సంక్షేమం–ఆత్మగౌరవానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలి* నల్లగొండ, అక్టోబర్ 4: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (PRGTA) ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాలోని మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలకు చెందిన ఉపాధ్యాయులతో జిల్లా కమిటీ నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ యాజమాన్య గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, సంక్షేమం, పని ఒత్తిడి, పరిపాలనా అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా 24 మంది సభ్యులతో PRGTA నల్లగొండ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. నూతన జిల్లా కమిటీ అధ్యక్షులుగా V. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా V. శివశంకర్,...