మహిళల భద్రతపై పద్మావతి కళాశాలలో షీ టీమ్ అవగాహన సదస్సు
టీ-సేఫ్ యాప్ వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించిన ఎస్సై రామారావు వరంగల్: మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, టీ-సేఫ్ యాప్ వినియోగంపై వరంగల్‌లోని పద్మావతి కళాశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు మాట్లాడుతూ.. నేరాలు, అఘాయిత్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా మహిళలపై జరిగే నేరాలను అరికట్టవచ్చన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాల వంటి నేరాల పట్ల విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని కోరారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్,...