రామప్ప పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిలిపివేయాలి: మడిపెల్లి నాగరాజు గౌడ్

వరంగల్: చారిత్రక ప్రాశస్త్యం కలిగిన రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓపెన్ కాస్ట్ మైనింగ్, బొగ్గు తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని బీజేపీ ఎండోమెంట్స్ ధార్మిక సెల్ వరంగల్ జిల్లా కన్వీనర్ మడిపెల్లి నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. మైనింగ్ కార్యకలాపాల వల్ల భూ ప్రకంపనలు, కంపనాలు ఏర్పడి రామప్ప ఆలయ నిర్మాణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మడిపెల్లి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వరంగల్ కాశిబుగ్గలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలో రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం ఆలయం వెలుపల నిరసన తెలిపారు. రామప్ప దేవాలయం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక...