హనుమకొండలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్
హనుమకొండలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.ఆర్. నాగరాజుతో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఆయన వెంటనే పదవికి...