చౌటుప్పల్ : ప్రమాదకరంగా డ్రైనేజీ గుంత!

చౌటుప్పల్ : స్థానిక 14 వ వార్డులో ప్రమాదకరంగా మారిన డ్రైనేజీ గుంత? వివరాలలోకి వెళితే 14 వ వార్డులో యాక్సిస్ బ్యాంకు పక్కన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపక్కన నిర్మించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. డ్రైనేజీపై ఏర్పాటు చేసిన కాంక్రీట్ స్లాబ్ మధ్యలో విరిగిపోయి, పెద్ద గుంతలా తెరుచుకుని ఉంది. దారికి సరిగ్గా మధ్యలో ఈ గుంత ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని కాలినడకన వెళ్లే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో సరిపడా వెలుతురు లేకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు, చిన్న పిల్లలు, వృద్ధులు ఈ ప్రమాదకర గుంత ఉంది. ఒకవేళ వర్షం వస్తే నీరు...