చౌటపల్లి సొసైటీ చైర్మన్‌కు పెరిక కుల సంఘం ఘన సన్మానం.

పర్వతగిరి, అక్టోబర్ జన చరిత్ర న్యూస్. చౌటపల్లి ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా పెరిక కులానికి చెందిన అతి మారస్వామి నియమితులైన సందర్భంగా వడ్లకొండ గ్రామంలోని పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. గ్రామంలోని పెరిక కుల సంఘం పెద్దలు జుట్టుకొండ వీరయ్య, కుల సర్పంచ్ జుట్టుకొండ మల్లయ్య, ఉపాధ్యక్షుడు జుట్టుకొండ దేవయ్య, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అతి కుమారస్వామిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చౌటపల్లి సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. అతి కుమారస్వామి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి...