భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి?

అవగాహన లోపంతో విడిపోతున్న కుటుంబాలు... మాటలతో పరిష్కరించుకోలేని సమస్యలే విషాదాలకు దారితీస్తున్నాయా? ఒకప్పుడు కుటుంబం అంటే అనుబంధం.. ఆప్యాయత.. పరస్పర గౌరవం.. ఒకరి కోసం ఒకరు నిలబడే మనస్తత్వం. కష్టాలు వచ్చినా కలిసి ఎదుర్కొని, సమస్యలను చర్చించుకుని, జీవిత ప్రయాణాన్ని చివరి వరకు కొనసాగించే దంపతులు ఉండేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు కుటుంబ వ్యవస్థలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు.. అవగాహన లోపం.. అనుమానాలు.. మాటలతో పరిష్కరించుకోలేని సమస్యలు.. చివరకు కుటుంబ కలహాలుగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వివాదాలు విడాకులు, కుటుంబ విచ్ఛిన్నం వరకు వెళ్తుండగా.. మరికొన్ని విషాదకర పరిస్థితుల్లో హత్యలు, ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి. అందం కాదు.....