క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో అవసరం: ఈగ మల్లేశం

వర్ధన్నపేట, అక్టోబర్ 7: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డి.సి. తండా దుర్గమ్మ గుడి ప్రాంగణంలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో కేశవపురం, ఎన్‌ఎస్ తండా జట్లకు టాస్ వేసిన ఈగ మల్లేశం.. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈగ మల్లేశం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు...