దళిత యువతికి బీఆర్ఎస్ సంఘీభావం*అమ్మాయి కి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

వర్దన్నపేట, (జన చరిత్ర న్యూస్):వర్దన్నపేట మున్సిపల్ పట్టణంలో ని మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కొడుకు పాలకుర్తి శ్రీకాంత్ చేతిలో ప్రేమ విషయం లో బలై గత రెండురోజులుగా చైర్మన్ ఇంటి ముందు టెంట్ వేసి మౌన పోరాటం చేస్తున్న దళిత యువతి శ్రీదేవిని మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ పరామర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి కి మాయ మాటలు చెప్పి శారీరకంగా అమ్మాయిని మూడు సంవత్సరాలుగా లోబర్చుకొని ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొనని ముఖం చాటెస్తూ అమ్మాయి ని తీవ్ర మానసిక వేదనకు గురిచేయ్యటం సబబు కాదన్నారు. గత మూడు రోజులుగా చైర్మన్ సారంగపణి...