ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా నాణ్యమైన విద్య...నాణ్యతలో రాజీ లేకుండా పనులు చేపట్టాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
జన చరిత్ర న్యూస్ వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కేఆర్ నాగరాజు * గురువారం పరిశీలించారు. సుమారు 16 ఎకరాల 11గుంటల విస్తీర్ణంలో 200కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్న పాఠశాల ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి భూమిని కేటాయించారు.ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక, భవన...