ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు (ఎన్రోల్మెంట్) ప్రక్రియపై అవగాహన
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల మండల కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షులు కుడికాల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా కన్వీనర్ సతీష్ షా,రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాలవెంకటరమణ, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మంజుల రెడ్డి హాజరయ్యారు. వారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ నమోదు విధానంపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. ఓటర్ జాబితాలో పేర్లు నమోదు...