మహిళల భద్రతపై అవగాహన కలిగి ఉండాలి కేఎంసీ ఫార్మసీ కళాశాలలో షీ టీమ్ అవగాహన సదస్సు
వరంగల్: మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండటం ద్వారా మహిళలపై జరిగే నేరాలను అరికట్టవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు అన్నారు. వరంగల్‌లోని కేఎంసీ ఫార్మసీ కళాశాలలో సుమారు 120 మంది విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, టీ-సేఫ్ అనువర్తనంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌లలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలను పంచుకునే విషయంలో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దని తెలిపారు. మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు టీ-సేఫ్...