టిబి రహిత భారత్ లక్ష్యంగా యువత చురుకైన భాగస్వామ్యం కావాలి జోష్ టీముల కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్: జిల్లాను క్షయ వ్యాధి రహితంగా తీర్చిదిద్దేందుకు యువత, ఎన్‌సీసీ క్యాడెట్లు చురుకుగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు. టిబి ముక్త్ భారత్ – ఆయుష్మాన్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జోష్ టీముల కార్యక్రమాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో క్షయ వ్యాధి నివారణ, లక్షణాలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. క్షయ వ్యాధి బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి అని, ప్రధానంగా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని కలెక్టర్ తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు...