ఎస్సార్ గోపాల్పూర్ పాఠశాల యందు బతుకమ్మ సంబరాలు

ఎస్సార్ గోపాల్పూర్ పాఠశాల యందు బతుకమ్మ సంబరాలు వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. ఇట్టి కార్యక్రమానికి ప్రముఖ గాయని జేరిపోతుల సంధ్య ముఖ్య అతిథులుగా పాల్గొని పాఠశాల విద్యార్థులతో ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జి రాజేశ్వర్ రెడ్డి కోఆర్డినేటర్ సరితా రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హిమబిందు గారు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియాలి అంటే ఇలాంటి పండుగ వేడుకలు విద్యార్థులకు తెలియాలి అన్నారు. అంతేకాక 10 రోజుల బతుకమ్మ వేడుకల ఆవశ్యకత దసరా వేడుకలను ఎందుకు జరుపుకుంటారో వారి ఉపన్యాసాల ద్వారా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.