హన్మకొండ ప్రెస్ క్లబ్‌లో సీనియర్ జర్నలిస్టులకు ఘన సత్కారం

ఉర్దూ జర్నలిజానికి గర్వకారణం.. 40 ఏళ్ల సేవలకు ఎం.ఏ. వహీద్ గుల్షన్‌కు తొలి గౌరవం హన్మకొండ, అక్టోబర్ 9: జర్నలిజం రంగంలో నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్టులను లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ బస్టాండ్ సమీపంలోని ప్రెస్ క్లబ్‌లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఎం.ఏ. వహీద్ గుల్షన్‌కు తొలి సత్కారం లభించడం ఉర్దూ జర్నలిజానికి గర్వకారణంగా నిలిచింది. అక్టోబర్ 9న ఉదయం 10.30 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు...