జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ.

జన చరిత్ర న్యూస్ పర్వతగిరిమండలంలోని చింతనెక్కొండ గ్రామం విజ్ఞాన భారతి విద్యాలయంలో శుక్రవారం జయహో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మరియు జయహో ఫౌండేషన్ వ్యవస్థాపకులు అక్కినపెల్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ *అవసరంలో ఉన్న వారికి సేవ చేయడం లోనే నిజమైన ఆనందం ఉంటుందని అన్నారు.* ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలకు ప్రతినెల విరాళాలు అందిస్తున్న విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాషా, రజిత, సుమలత, సరిత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.