ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్
ఇసుక లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై కఠిన చర్యలు నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమానులదీ బాధ్యత ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్ ములుగు జిల్లా: జిల్లాలో ఇసుక లారీల అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, రహదారులపై అక్రమ పార్కింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్ తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వాహనాలు నడిపినా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా లారీలను నిలిపినా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక లారీ డ్రైవర్లు నిర్దేశిత వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా...