వరంగల్‌లో అపరిశుభ్ర వాతావరణంలో పాల ఉత్పత్తుల విక్రయం వరంగల్ మిల్క్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి.. రూ.1.29 లక్షల విలువైన ఆహార పదార్థాలు స్వాధీనం
వరంగల్: వరంగల్ నగరంలోని చార్‌బౌలీ ప్రాంతంలో ఉన్న వరంగల్ మిల్క్ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు, అవసరమైన లైసెన్సులు లేకుండా పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడి చేపట్టారు. టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీల్లో నెయ్యి, ఖోవా, మలాయ్, బ్రెడ్ తదితర పాల ఉత్పత్తులు అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, నిల్వకు సంబంధించిన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ దాడిలో మొత్తం రూ.1,29,065 విలువైన ఆహార పదార్థాలు, ఇతర సంబంధిత వస్తువులను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం...