వరంగల్ రైల్వే స్టేషన్‌లో నాలుగు చోరీ మొబైల్ ఫోన్లు స్వాధీనం ఖమ్మం–వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

వరంగల్, అక్టోబర్ 9: వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు (జీఆర్‌పీ) నలుగురు మొబైల్ ఫోన్లు చోరీకి గురైన కేసులో నిందితుడు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి సుమారు రూ.80 వేల విలువైన నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ సీఐ వి. నరేష్ కుమార్ కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం వరంగల్ రైల్వే స్టేషన్‌లోని మొదటి నంబర్ ప్లాట్‌ఫామ్‌పై పార్సిల్ కార్యాలయం సమీపంలో హెడ్ కానిస్టేబుల్ ఎస్. రవీందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు డి. రాము, కె. దినేష్, రైల్వే రక్షణ దళం హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాస్, నేర పరిశోధన విభాగం హెడ్ కానిస్టేబుల్ ఎన్. రమేష్...