గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగిన తిప్పర్తి కిరణం
రాష్ట్రస్థాయి కబడ్డీ సమరానికి ‘వర్షిణి’ సిద్ధం! అశ్వారావుపేటలో జరిగే జూనియర్ బాలికల పోటీల్లో జిల్లా ప్రాతినిధ్యం గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్రస్థాయికి ఎదిగిన తిప్పర్తి కిరణం హర్షం వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయులు పి. నరసింహ నాయక్, వ్యాయామ ఉపాధ్యాయుడు లెనిన్ బాబు మన తెలంగాణ / తిప్పర్తి: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభకు సరైన ప్రోత్సాహం లభిస్తే వారు జాతీయ, రాష్ట్ర స్థాయిలలో సత్తా చాటుతారని తిప్పర్తి విద్యార్థిని జెర్రిపోతుల వర్షిణి మరోసారి నిరూపించింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని PM SHRI ZPHS పాఠశాలలో చదువుతున్న వర్షిణి, తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఇటీవల నిర్వహించిన...