2029లో ఆకుల రాజేందర్ రాజకీయ అరంగేట్రం?

హనుమకొండ: టి.ఎన్.జి.ఓస్ మరియు జేఏసీ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆకుల రాజేందర్ రాబోయే రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా? అనే చర్చ స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల రాజేందర్ ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నాయకుడిగా తనదైన గుర్తింపు పొందారు. అయితే, 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే రోజుల్లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతున్నప్పటికీ, దీనిపై ఆకుల రాజేందర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2029 నాటికి ఆయన రాజకీయాల్లోకి...