కుటుంబ కలహాలు ఎలా సర్దుకోవాలి? డబ్బుతో కుటుంబ బంధాలను పోల్చకూడదు!

కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో నివసించే మనుషుల సమూహం కాదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, నమ్మకం, పరస్పర గౌరవంతో ముడిపడిన బంధాల సమాహారం. అలాంటి కుటుంబంలో అప్పుడప్పుడు చిన్నచిన్న గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. అయితే ఆ సమస్యలను సరైన సమయంలో పరిష్కరించుకోకపోతే అవే పెద్ద కలహాలుగా మారి కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతాయి. కుటుంబ కలహాలకు ప్రధాన కారణాల్లో డబ్బు కూడా ఒకటి. ఆర్థిక సమస్యలు, ఆస్తి పంపకాలు, సంపాదనలో తేడాలు, ఖర్చుల విషయంలో అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా డబ్బున్నవారిని ఎక్కువగా గౌరవించడం, డబ్బు లేనివారిని తక్కువగా చూడడం వంటి ఆలోచనలు కుటుంబ బంధాలను...