శివనగర్ వరంగల్‌లో ఘనంగా గ్యారవీ షరీఫ్ వేడుకలు..మహమ్మద్ షౌకత్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో గ్యారవీ షరీఫ్

*గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక వరంగల్..అన్ని మతాలను గౌరవించుకోవడం మన సంప్రదాయం వక్తలు* వరంగల్, అక్టోబర్ 11: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ శివనగర్ రైల్వే స్టేషన్ ఆటో పాయింట్ వద్ద గ్యారవీ షరీఫ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మత సామరస్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ తోవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ జబ్బార్,వ్యాపారవేత్త సయ్యద్ మఖ్దూమ్,సామాజిక కార్యకర్త మిర్గో అశోక్,మాజీ కార్పొరేటర్ నాగరాజు,బీఆర్ఎస్ నాయకుడు సయ్యద్ మసూద్,హసన్ అలీబేగ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వరంగల్ జిల్లా గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా...