విద్యార్థులకు వైష్ణవి పురస్కారాల ప్రదానం విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి – రాజనాల శ్రీహరి
వరంగల్: శివనగర్‌లోని శ్రీ వైష్ణవి సంఘం, వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో విద్యార్థులకు వైష్ణవి పురస్కారాలను అందజేశారు. సభకు వెలుగులేటి సేనాచార్యులు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, కాటూరి ఇందుమతి, కందల కృష్ణమాచార్యులు, రాష్ట్ర వైష్ణవ సంఘ ఉపాధ్యక్షుడు దరిపెళ్లి సంపత్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవి సంఘం సభ్యులు కాటూరి శ్రవణ్ కుమార్, హరిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులతోపాటు శాలువాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రాజనాల శ్రీహరి, దరిపెళ్లి సంపత్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి...