మిల్స్ కాలనీలో ‘ఆపరేషన్ చెబుత్రా’ *28 మందిపై కేసులు..10 బైక్‌లు,24 మొబైల్ ఫోన్లు స్వాధీనం*
*తెలంగాణ/వరంగల్,అక్టోబర్ 12* శాంతిభద్రతల పరిరక్షణ,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం,అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా సంచరించడం,న్యూసెన్స్‌కు పాల్పడే వారిని నియంత్రించే లక్ష్యంతో మిల్స్ కాలనీ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ‘ఆపరేషన్ చెబుత్రా’ నిర్వహించారు.వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత,ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో 28 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.వారి నుంచి 10 మోటార్‌సైకిళ్లు,24 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.చింతల్,అబ్బనికుంట,లేబర్ కాలనీ,ఫోర్ట్ వరంగల్,శివనగర్,ఎస్ఆర్ఆర్ తోట,ఉర్సుగుట్ట,కరీమాబాద్,ఉర్సు,శంభునిపేట,రంగశాయిపేట తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 15 మందిపై సీపీ యాక్ట్ సెక్షన్ 70(ఏ) కింద కేసులు నమోదు చేయగా,ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడిన మరో 13 మందిపై సీపీ...