మామ్నూరు పీటీసీలో యువ ఆపదా మిత్ర శిక్షణ.. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
వరంగల్, అక్టోబర్ 12: వరంగల్ జిల్లా మామ్నూరులోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)లో నిర్వహిస్తున్న CATC-VIII శిక్షణ శిబిరంలో భాగంగా యువ ఆపదా మిత్ర పథకంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమంతో పాటు స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అక్టోబర్ 5 నుంచి 14 వరకు కొనసాగుతున్న ఈ శిక్షణ శిబిరంలో భాగంగా క్యాడెట్లకు అగ్నిప్రమాదాల నివారణ, అగ్నిమాపక పరికరాల వినియోగం, ప్రమాద సమయాల్లో సురక్షితంగా వ్యవహరించే విధానాలపై నిపుణులైన ఇన్స్ట్రక్టర్లు అవగాహన కల్పించారు. అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించి మంటలను అదుపు చేసే విధానాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అనంతరం భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యత, రక్తదానం...