కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా అమలు పరచకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని వరంగల్ ఉమ్మడి జిల్లా ల ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా అమలు పరచకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని వరంగల్ ఉమ్మడి జిల్లా ల ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి హెచ్చరించినారు మంగళవారం రోజున వరంగల్ చౌరస్తా లో ఉద్యమకారులందరూ చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టి మరుపల్ల రవి మాట్లాడినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది ఉద్యమకారులు తమ సంపాదన కోల్పోయి తమ కుటుంబాలను మరిచిపోయి తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా పనిచేసిన ఉద్యమకారుల బతుకులు నేడు ఎంతో ఘోరంగా ఉందని తెలంగాణ ఉద్యమంలో జైలు జీవనం రిమాండ్ బైండోవర్లు...