టీబీ ముక్త్ భారత్‌పై ఎన్‌సీసీ క్యాడెట్ల అవగాహన కార్యక్రమం.వీధి నాటికలు, ర్యాలీతో ప్రజల్లో చైతన్యం – 10(టీ) బీఎన్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

వరంగల్:** టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 10(టీ) బీఎన్ ఎన్‌సీసీ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఆపదా మిత్ర స్కీమ్ (YAMS) శిక్షణ శిబిరంలో భాగంగా మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్లు వీధి నాటికలు ప్రదర్శించడంతో పాటు అవగాహన ర్యాలీ చేపట్టి ప్రజలకు క్షయవ్యాధి (టీబీ) నివారణ, చికిత్సపై సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా క్యాంప్ కమాండెంట్ మాట్లాడుతూ, ఎన్‌సీసీ క్యాడెట్లను కేవలం విపత్తుల సమయంలో స్పందించే వారిగానే కాకుండా, దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములుగా, ఆరోగ్య రాయబారులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రధానమంత్రి లక్ష్యమైన టీబీ ముక్త్ భారత్ సాధనలో యువత కీలక...