రెడ్‌క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఘన సన్మానం

వరంగల్: రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబును ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షుడు రొటేరియన్ సోమ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ చిరంజీవి చేతన్ శౌర్యకు క్రీడల్లో మరింత రాణించేందుకు ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే రెడ్‌క్రాస్ సభ్యుడు, రొటేరియన్ తోట సంపత్‌ను, వరంగల్ జిల్లా ఫోటోగ్రఫీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రొటేరియన్ వంగరి వేణుగోపాల్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ కార్యదర్శి రొటేరియన్ నాయిని అనిల్ కుమార్, జూలూరి...