ఊకల్ నాగేంద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణా రాష్ట్ర (ఎండోమెంట్స్ ) దేవాదాయ కమీషనర్ శ్రీ. M. హనుమంత రావు.

సుప్రసిద్ధ ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయాంభువుగా వెలిసి ఇప్పటికీ తన ఉపస్థితి చాటుతూ, వల్మీకమే గర్భలయంగా, నిత్య పూజలతో వారోత్సవాలతో భక్తుల కొంగు బంగారమై స్వయంభువుగా ప్రపంచంలోనే ప్రత్యేకంగా సుప్రసిద్ధమైన ఊకల్ దేవాలయానికి తెలంగాణా రాష్ట్ర ఎండోమెంట్స్ (దేవాదాయ ) శాఖ కమీషనర్ శ్రీ. M. హనుమంత రావు గారు దేవాలయం మహిమ తెలుసుకొని నేడు ధర్మ పత్ని సమేతంగా విచ్చేసి, పుట్టలో పాలు పోసి మొక్కుచెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీమాన్ సముద్రాల సుదర్శన్ ఆచార్య వర్యులు ఆలయ సంప్రదాయలతో స్వాగతించి ప్రత్యేక పూజలు చేయించి అనంతరం వారిని వేదాశీర్వచనము మరియి స్వామి వారి శేష వస్త్రములను...