గోపాలస్వామి గుడి జంక్షన్‌లో విచ్చలవిడిగా వాహనాల పార్కింగ్! ప్రమాదాలకు నిలయంగా మూలమలుపు.. పట్టించుకోని వైన్స్ యాజమాన్యం.. చోద్యం చూస్తున్న పోలీస్ శాఖ!

వరంగల్, కొత్తవాడ: గోపాలస్వామి గుడి జంక్షన్‌లోని మహంకాళి అమ్మవారి ఆలయం ఎదురుగా, శ్రీ వెంకటేశ్వర తెలంగాణ వైన్స్ ముందు విచ్చలవిడిగా వాహనాలు పార్కింగ్ చేయడం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. మూలమలుపు వద్ద వాహనాలను అడ్డదిడ్డంగా నిలపడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్, కొత్తవాడ ప్రాంతాల్లో విద్యాసంస్థలు, కళాశాలలు, ఆసుపత్రులు ఉండటంతో ఈ మార్గంలో విద్యార్థులు, రోగులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి రద్దీ ప్రాంతంలో పరిమిట్ రూమ్‌తో కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర తెలంగాణ వైన్స్ వద్ద వాహనాల పార్కింగ్ సమస్య మరింత తీవ్రంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. వైన్స్‌కు వచ్చే కొందరు మద్యం సేవించిన అనంతరం...