*టి ఎస్ జె యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గా పంతం సురేందర్ నియామకం*

జన చరిత్ర మహబూబాబాద్ జిల్లా బ్యూరో తొర్రూర్ 16 మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ పరిధి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (TSJU) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న పంతం సురేందర్ నియమితులయ్యారు. టీఎస్ జేయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు గణపనేని చంద్రశేఖర్ పంతం సురేందర్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన పంతం సురేందర్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల...