దుర్గాభవాని మహాన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన ఎమ్మెల్యే

వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరంలోని 56వ డివిజన్ గోపాలపురంలో నవదుర్గ ఉత్సవ కమిటీ, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆర్చ్, శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గాభవాని మహాన్నదాన కార్యక్రమంలో వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. భక్తులతో ఆప్యాయంగా మెలుగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను నిర్వాహకులు, భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది....