పెద్దమడుర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. హాజరై బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

పెద్దమడుర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. హాజరై బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. *చీకట్లోనే సుమారు 20 నిమిషాలకు బతుకమ్మ ఆడిన మహిళలు.* *రాష్ట్రంలో కరెంట్ కష్టాలు రేవంత్ చెయ్యబట్టే.* జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడుర్ గ్రామంలో 7వ రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆ గ్రామ ఆనవాయితీ వస్తుంది. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో కోలాటం కూడా ఆడారు. మహిళల్లో పండుగ ఉత్సాహాన్ని నింపుతూ వారితో మమేకమై మాజీ మంత్రి ఎర్రబెల్లి బతుకమ్మ ఆడటంతో అందరిలోనూ ఆనందోత్సాహాలు...