వరంగల్ పశ్చిమలో 16 వేల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్: గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఊరట లభిస్తోందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 16 వేల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వికాస్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీలలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో అనేక పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరమయ్యాయని...