భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. వెంట డీసీసీ అధ్యక్షుడు ఇనగాల, ఎమ్మెల్యే నాయిని
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. వెంట డీసీసీ అధ్యక్షుడు ఇనగాల, ఎమ్మెల్యే నాయిని వరంగల్, అక్టోబర్ 17: శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం దర్శించుకున్నారు. ఆయన వెంట హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులకు అర్చకులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాల...