విద్యా, సామాజిక రంగాల్లో విశేష సేవలందించిన భాస్కర్‌కు సముచిత గుర్తింపు ఇవ్వాలి – మందల శంకరయ్య, మెరుగు సత్తయ్య
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పద్మశాలి విద్యావేత్త ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు అవకాశం కల్పించాలి విద్యా, సామాజిక రంగాల్లో విశేష సేవలందించిన భాస్కర్‌కు సముచిత గుర్తింపు ఇవ్వాలి – మందల శంకరయ్య, మెరుగు సత్తయ్య హనుమకొండ: రానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ గడ్డం భాస్కర్‌కు అవకాశం కల్పించాలని శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మందల శంకరయ్య, పద్మశాలి పరపతి సంఘం అధ్యక్షుడు మెరుగు సత్తయ్య కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మందల శంకరయ్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాకతీయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర...