క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. జన

చరిత్ర న్యూస్ (పర్వతగిరి) వర్ధన్నపేట మున్సిపాలిటీలోని డిసి తండా యువకుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈ సందర్భంగా తాను క్రికెట్ ఆడుతూ అందరినీ ఆశ్చర్య పరిచారు, అనంతరం ఇరు జట్టులో ప్లేయర్లను పరిచయ కార్యక్రమం చేసి టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వ హయంలో గ్రామంలో పండుగలు అంటే ఆట పాటలతో ఉర్లు మొత్తం సందడిగా మారేది. వాటిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు గ్రామాల్లో యువతను చైతన్య పరిచేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి ఆటలు ఆడడం కొరకు పోటీలను నిర్వహించేవారని...