*తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ*
జన చరిత్ర, మహబూబాబాద్ జిల్లా బ్యూరో తొర్రూర్, అక్టోబర్ 18 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని పెద్ద చెరువు వద్ద సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతు పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు,...