లేబర్ కాలనీలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు బతుకమ్మ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు

వరంగల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు వరంగల్‌లోని లేబర్ కాలనీలో అంబరాన్నంటాయి. ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాదిమంది మహిళలు, ప్రజలు పాల్గొని సంప్రదాయ పూల బతుకమ్మలతో తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో విజేతలకు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా వన్‌గ్రామ్ గోల్డ్ బహుమతిని ప్రదానం చేయగా, ఇతర విజేతలకు, ఎయిర్ ఫైర్లు కన్సొలేషన్ బహుమతులు కూడా అందజేశారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు, మహిళల కోలాటాలు, సంప్రదాయ...