వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో ఘనంగా రావణ వధ కార్యక్రమం

దసరా పండుగ వేళ.. రంగలీల మైదానంలో రావణ వధ వేడుకలు అంబరాన్నంటాయి..! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీల మైదానంలో రావణ వధ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహించారు. దసరా పండుగ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రావణ వధ ఘట్టాన్ని ఆసక్తిగా వీక్షిస్తూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఆస్వాదించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగలో రావణ వధకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అహంకారం, దుర్మార్గం, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు....