పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండలో పోలీసు అమరవీరుల ర్యాలీలో పాల్గొని ఘన నివాళులర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే హనుమకొండ: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన పోలీసు ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. హనుమకొండ చౌరస్తా నుంచి పోలీసు ప్రధాన కార్యాలయం వరకు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని, దేశ రక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. అనంతరం పోలీసు ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి...