పోలీస్ అమరవీరుడు భీమ్ సింగ్ జ్ఞాపకార్థం 12 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
తాడ్వాయి: పోలీస్ అమరవీరుడు భూక్య భీమ్ సింగ్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారు. ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 గ్రామ పంచాయతీలకు చెందిన ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి చొప్పున మొత్తం 12 కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. భూక్య భీమ్ సింగ్ 1994 నుంచి 1996 వరకు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. విధి నిర్వహణలో ఉండగా, 1996 సెప్టెంబర్ 23న మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన ఆయన, మరుసటి రోజు సెప్టెంబర్ 24న తుదిశ్వాస విడిచి పోలీస్ అమరవీరుడిగా నిలిచారు. తన...