పేదల పక్షాన నిలిచి.. దోపిడీని ఎదిరించి.. ప్రజల గుండెల్లో నిలిచిన పోరాట యోధుడు పండుగ సాయన్న: మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

పేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలిచి, భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు పండుగ సాయన్న అని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పేదల పట్ల ఆయన చూపిన ఆదరణ, అన్యాయాన్ని ఎదిరించిన పోరాట స్ఫూర్తి కారణంగానే ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. గురువారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, మున్సిపల్ కమిషనర్ శ్రీ బి. వంశీ కృష్ణ, కార్పొరేటర్లు, కార్యాలయ సిబ్బందితో కలిసి పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, పండుగ...