హనుమకొండ శాంపేటలో వైన్ షాపుల ముందు ట్రాఫిక్ ఇబ్బందులు.. అంబులెన్స్‌లకు దారి కరువు!

సాయంత్రం వేళల్లో పెరుగుతున్న రద్దీ.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు – అధికారులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి హనుమకొండ జిల్లా శాంపేట ప్రాంతంలో వైన్ షాపుల ముందు సాయంత్రం వేళల్లో నెలకొంటున్న రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మద్యం దుకాణాల వద్దకు వచ్చే వాహనాలు, రోడ్లపై నిలిచే ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం సమయం వచ్చిందంటే చాలు, వైన్ షాపుల పరిసర ప్రాంతాలు రద్దీగా మారడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. ఈ సమస్యలో అత్యంత ఆందోళన కలిగించే అంశం అత్యవసర సేవలకు సంబంధించినది. వైన్ షాపుల...