సేవా కార్యక్రమాలతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలు
వరంగల్ చౌరస్తాలో కేక్ కటింగ్, అన్నదానం.. మున్సిపల్ కార్మికులకు దుప్పట్ల పంపిణీ వరంగల్, అక్టోబర్ 23: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వరంగల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కొండా మురళీధర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 25వ డివిజన్ సీనియర్ నాయకుడు జన్ను శ్యామ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల్ నవీన్ రాజును శాలువాతో సత్కరించారు. జన్మదిన వేడుకలను సేవా...