ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి

ముప్పారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య హనుమకొండ, అక్టోబర్ 24: జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల సమ్మె ప్రభావం ప్రజలకు అందించే వైద్య సేవలపై పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య సంబంధిత వైద్య అధికారులు, సిబ్బందికి సూచించారు. ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ముప్పారం గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను శనివారం సందర్శించిన ఆయన, అక్కడ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లు, వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తనిఖీ చేసి, వైద్య సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు....