ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు ..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎండిపోయిన ఎస్సారెస్పీ కాలువలు… ఎండుతున్న రైతుల ఆశలు… ఇదేనా కాంగ్రెస్ పాలన జన చరిత్ర న్యూస్ (బ్యూరో పర్వతగిరి) వరంగల్లోని ఆరేపల్లి వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాలువలను పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజల పండుగైన బతుకమ్మకైనా నీళ్లు అందించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడింది రైతులకు నీళ్లివ్వడం చేతకాక చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం! కాలువల్లో నీళ్లు పారాల్సిన సమయంలో ఎడారిని తలపిస్తున్న పరిస్థితులు కాంగ్రెస్ పాలనలోని అసమర్థతకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు....